KTR : టీఎస్ఐపాస్ దేశానికి ఆదర్శం
16 లక్షల ఉద్యోగాల కల్పన
KTR : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్ఐపాస్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటున్నాయని చెప్పారు.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ను ఏర్పాటు చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు వెల్లువలా వచ్చాయని తెలిపారు. గత 8 ఏళ్లలో 19 వేల కేసులను పరిష్కరించడం జరిగిందని చెప్పారు.
ఇప్పటి దాకా రూ. 2.71 లక్షల కోట్లు తీసుకు వచ్చామని, ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు కేటీఆర్(KTR). ఈ పెట్టుబడుల వల్ల 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడం జరిగిదని వెల్లడించారు.
ఆస్ట్రేలియన్ కాన్సులేట్ నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకు వచ్చిన టీఎస్ఐపాస్ దేశంలో ఎక్కడా లేదన్నారు.
గతంలో రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు జంకే వారని, కానీ ఇప్పుడు ఆ సీన్ మారిందన్నారు. మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ టాప్ లో ఉందన్నారు.
దీని వల్ల అన్ని రంగాలకు చెందిన కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నాయని చెప్పారు కేటీఆర్(KTR). తెలంగాణ ఐటీలోనే కాదు ఫార్మా, అగ్రి, ఈ కామర్స్ , వీ హబ్ లలో టాప్ లో ఉందన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక యూఎస్ స్టూడెంట్ వీసాలు కలిగిన నగరంగా హైదరాబాద్ నిలిచిందని వెల్లడించారు మంత్రి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ అగ్ర భాగాన ఉందని తెలిపారు.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా ప్రభుత్వం మోస్ట్ ఫ్యూచర్డ్ స్టేట్ గా తెలంగాణను గుర్తించడం సంతోషకరంగా ఉందన్నారు కేటీఆర్.
Also Read : బీపీసీఎల్ పై వెనక్కి తగ్గిన కేంద్రం