TSPSC Exams : అయోమయం పరీక్షలు కష్టం
టీఎస్పీఎస్సీ తీరు అనుమానాస్పదం
TSPSC Exams : ఆర్భాటంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత పేపర్ల లీకుల వ్యవహారం బయటకు పొక్కడంతో సంస్థ పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాల ఆందోళన ఓ వైపు నిరుద్యోగుల ఆందోళనల మధ్య అసలు పరీక్షలు జరుగుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. పేపర్ లీకుల వ్యవహారంపై సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటి దాకా 15 మందికి పైగా అదుపులోకి తీసుకుంది.
సోమవారం టీఎస్పీఎస్సీ(TSPSC Exams) చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ , సభ్యులతో పాటు ఇతర ఆఫీసు, కాంట్రాక్టు సిబ్బందిని ప్రశ్నించింది.
ఇదే క్రమంలో పేపర్ లీకేజీల స్కామ్ లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానం వ్యక్తం కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. హవాలా రూపంలో ఏమైనా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు చైర్మన్ కానీ ఆయా పరీక్షలకు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో లక్షాలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గతంలో సీడీపీఓ, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పరీక్షలు ముగిశాయి. వాటి గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఏప్రిల్ 23న ఏఎంవీఐ , 25న ఏవో , 2, 27 తేదీల్లో గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
కానీ ఇప్పటి వరకు సిట్ , ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా పరీక్షలు ఎలా నిర్వహిస్తారనేది అనుమానంగా ఉంది. నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన చైర్మన్ ఇప్పుడు సిట్ ముందు హాజరు కావడం చర్చకు దారి తీసేలా చేసింది. మొత్తంగా ఉద్యోగాలు వస్తాయని ఆశించిన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది టీఎస్పీఎస్సీ.
Also Read : లీకేజీల పర్వం ఇంకెంత కాలం