TSPSC Group 4 Exam Date : జులై 1న గ్రూప్ 4 ఎక్జామ్ ఫిక్స్
ప్రకటించిన టీఎస్పీఎస్సీ
TSPSC Group 4 Exam Date : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే గ్రూప్ -1 పరీక్ష కు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ను నిర్వహించిన కమిషన్ మెయిన్స్ కూడా ప్రకటించింది. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున గ్రూప్ -4 కు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. భారీ ఎత్తున డిమాండ్ ఉండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచింది.
ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఇవాల్టి వరకు ఏకంగా 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఉద్యోగ నియామక సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉండగా గ్రూప్ -4 పరీక్షకు(TSPSC Group 4 Exam Date) సంబంధించి తేదీని ఖరారు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు వచ్చే జులై 1న గ్రూప్ – 4 పోస్టులకు సంబంధించి పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.
రెండు సెషన్లలో ఈ పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుందని వెల్లడించింది. ఇక రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నిర్వహించనున్నట్లు తెలిపింది టీఎస్పీఎస్సీ . ఓఎంఆర్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది.
గ్రూప్ -4 కింద మొత్తం 8,180 పోస్టులను భర్తీ చేయనుంది. మరో వైపు కేవలం ఫీజుల ద్వారానే నియామక సంస్థకు కోట్లాది రూపాయలు వచ్చినట్లు అంచనా. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కు కూడా నియామక పత్రం ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం సర్కార్ కేవలం ఎన్నికల స్టంట్ గా చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు.
Also Read : దేశం అభివృద్దిని విస్మరించిన బడ్జెట్