TSPSC : టీఎస్పీఎస్సీ కీల‌క నిర్ణ‌యం

ప్ర‌త్యేక అర్హుల‌కు ప్ర‌యారిటీ

TSPSC : తెలంగాణ ప్ర‌భుత్వం 90 వేల 39 పోస్టుల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేర‌కు 30 వేల 349 పోస్టుల‌కు ముందుగా ఆర్థిక శాఖ ప‌ర్మిష‌న్ ఇచ్చింది.

ఇందులో భాగంగా ప్ర‌ధానంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ – టీఎస్పీఎస్సీ (TSPSC)పై ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు ఆధార‌ప‌డ్డారు.

ఇప్ప‌టికే భ‌ర్తీ చేస్తారా లేదా అన్న‌ది ఇంకా అనుమానంగానే ఉంది.

త్వ‌ర‌లో భ‌ర్తీకి సంబంధించి ఇచ్చే గ్రూప్ -1 నోటిఫికేష‌న్ లో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఆప్ష‌న్స్ ఇచ్చేలా మార్పు చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

19 శాఖ‌ల‌కు సంబంధించి 503 పోస్టుల‌కు త్వ‌ర‌లో నోటిఫికేష‌న్ ఇవ్వ‌నుంది.

ఇదిలా ఉండ‌గా ఆయా పోస్టుల‌కు గాను అన్నింటికి డిగ్రీ మినిమం అర్హ‌త కాగా ప్ర‌త్యేక అర్హ‌త‌లు క‌లిగిన వారికి ప్ర‌యారిటీ ఇచ్చేలా చూస్తోంది క‌మిష‌న్.

అయితే కామ‌న్ పోస్టుల‌కు డిగ్రీ అర్హ‌త ఉంటే చాలు. ఇక ప్ర‌త్యేక అర్హ‌తలు ఉన్న వారికి ఎంపిక చేసిన పోస్టుల‌కు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకుంటే బెట‌ర్ అనుకుంటోంది. ఇందుకు గాను ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలోనే ఈ ఆప్ష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

అయితే దీనికి గాను నిర్ణ‌యం తీసుకోలేదు. ఎన్ని పోస్టుల‌కు అర్హ‌త సాధిస్తే అన్నింటికి ఛాన్స్ ఇచ్చేలా చేసింది. ఆప్ష‌న్ ఎంపిక స‌మ‌యంలో త‌గు జాగ్ర‌త్త తీసుకోవాల‌ని చెబుతోంది.

డీఎస్పీ, జైళ్లు, అగ్నిమాప‌క , ఎక్సైజ్ ఉద్యోగాల‌కు మాత్రం వయో ప‌రిమితి స‌డ‌లింపు ఇవ్వ‌లేదు. ఆర్టీఓకు బీటెక్ మెకానిక‌ల్ , ఆటోమొబైల్ ఇంజ‌నీరింగ్ డిగ్రీ ఉండాలి.

ఏఏఓకు డిగ్రీలో కామ‌ర్స్, ఎక‌నామిక్స్ పాసై ఉండాలి. ఏసీఎల్పీ పోస్టుకు డిగ్రీ అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ అద‌న‌పు అర్హ‌త‌లు ఉంటే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. సోష‌ల్ వ‌ర్క్, సోషియాల‌జీ పూర్త వ‌యిన వారిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పోస్టుకు డిగ్రీ అర్హ‌త ఉన్నా సోషియాల‌జీ, సోష‌ల్ వ‌ర్క్ పూర్తి చేసిన వారికి ఛాన్స్ ఇస్తారు.

Also Read : ఏపీ విద్యా రంగంలో కీల‌క మార్పులు

Leave A Reply

Your Email Id will not be published!