Medaram Jatara RTC : ఆసియా లోనే అతి పెద్ద జన జాతరగా ప్రసిద్ది చెందిన మేడారం జాతర(Medaram Jatara RTC) ప్రారంభానికి సిద్దమైంది. ఇప్పటికే లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువు తీరిన మేడారం ఇప్పుడు జనసంద్రమైంది.
ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండి పోయింది. ఎక్కడ చూసినా భక్తులే. ఎటు చూసినా ఆనంద మహోత్సవమే. దక్షిణాదిలో అతి పెద్ద కుంభమేళాగా ఇప్పటికే వినుతికెక్కింది.
రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఈసారి 3 వేల 845 బస్సులను అందబాటులో ఉంచామని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ (Medaram Jatara RTC)వెల్లడించారు.
ఇదిలా ఉండగా మేడారం సమ్మలక్క సారలమ్మ జాతర ఈనెల 16 నుంచి 19 వరకు జరగనుంది. కరోనా కారణంగా భక్తులు ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున తరలి వచ్చారు.
నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జన జాతరకు 2 కోట్ల మందికి పైగా హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ఇదిలా ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన బస్సులే కాకుండా అదనంగా బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు
ఎండీ. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే అత్యధికంగా ఇక్కడికి వస్తారని అందుకే ఇక్కడి నుంచే 2 వేల 250 బస్సులు నడుపుతున్నారు.
కాగా మేడారం జాతర ప్రాంగణంలో తాత్కాలికంగా 50 ఎకరాల్లో టీఎస్ఆర్టీసీ బస్టాండును ఏర్పాటు చేసింది. మేడారం జన జాతర కోసం సీఎం కేసీఆర్ రూ. 75 కోట్లు మంజూరు చేశారు.
Also Read : మేడారం జాతరకు సర్వం సిద్దం