TSRTC MD Sajjanar : ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు టీఎస్ఆర్టీసీ

ఎండీ సంచ‌ల‌న నిర్ణ‌యం

TSRTC MD Sajjanar :  తెలంగాణ ఆర్టీసీలో కీల‌క నిర్ణ‌యాల‌కు శ్రీ‌కారం చుట్టారు మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్(TSRTC MD Sajjanar). ఇప్ప‌టికే కార్గో స‌ర్వీస్ ప్ర‌వేశ పెట్టారు. కొత్త బ‌స్సుల‌ను ప్ర‌వేశ పెట్టారు. ఆర్టీసీని లాభాల బాట ప‌ట్టించేందుకు న‌డుం బిగించారు. ప్ర‌జ‌ల‌తో స‌త్ సంబంధాలు నెల‌కొల్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా మ‌రో సంచ‌ల‌నానికి తెర తీశారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌తి ఊరికో ప్ర‌త్యేక అధికారిని నియ‌మించ‌నున్న‌ట్లు తెలిపారు.

వీరి ప‌ని ఏమిటంటే ప్ర‌జ‌ల‌కు ఆర్టీసీ సేవ‌ల గురించి తెలియ చేయ‌డం. అంతే కాదు ప్ర‌జ‌ల‌కు ఆర్టీసికి మ‌ధ్య బంధాన్ని బ‌ల‌ప‌డేలా చేయ‌డం. ప్ర‌జ‌లు ఆర్టీసీ బస్సుల‌లోనే ఎక్కేలా చేస్తారు. వీరిని బ‌స్ ఆఫీస‌ర్ల పేరుతో నియ‌మించ‌నున్నారు. ప్ర‌యాణీకుల‌ను త‌మ వైపు తిప్పుకునేలా చేయ‌నున్నారు.

ఊరికి ఒక‌రిని నియ‌మిస్తారు. అయితే వీరు స్వ‌చ్చంధంగా ప‌ని చేయాల్సి ఉంటుంది. ఎలాంటి వేత‌నం అంటూ ఉండ‌దు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకునే వారికి స‌దవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు ఎండీ స‌జ్జ‌నార్(TSRTC MD Sajjanar). వీరిని మే1 నుంచి నియ‌మించాల‌ని ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఇప్ప‌టికే ఉంటున్న కండ‌క్ట‌ర్లు, డ్రైవ‌ర్లు, ఇత‌ర ఉద్యోగుల‌ను గ్రామ అధికారులుగా నియ‌మిస్తారు.

Also Read : కొలువుల‌పై కృత్రిమ మేధ‌స్సు ప్ర‌భావం

Leave A Reply

Your Email Id will not be published!