TSRTC MD : ప్రయాణీకులకు ఖుష్ కబర్ – ఎండీ
ఈ నెలాఖరు వరకు 10 శాతం రాయితీ
TSRTC MD : ప్రతి రోజూ లక్షలాది ప్రయాణీకులను చేరవేస్తోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC MD). ప్రస్తుతం సంస్థను గట్టెక్కించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు వీసీ సజ్జనార్. ఎన్నో ప్రయోగాలకు పెద్ద పీట వేశారు. ఆపై కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కొత్త బస్సులను ప్రవేశ పెట్టారు. ప్రముఖ ఆలయాలు, దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రాంతాలకు కూడా బస్సులను నడుపుతున్నారు. ఎలాగైనా సంస్థను గట్టెక్కించాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే కార్గో సర్వీసులను ప్రవేశ పెట్టారు. దీని ద్వారా మెరుగైన ఆదాయం సమకూరుతోంది.
తాజాగా మరో కీలక ప్రకటన చేశారు ఎండీ సజ్జనార్(TSRTC MD). హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణం చేస్తున్నారు. ఓ వైపు రైళ్లు, ఇంకో వైపు బస్సులు చాలడం లేదు. మరో వైపు ఏపీఎస్ఆర్టీసీ కూడా భారీ ఎత్తున బస్సులను నడుపుతోంది విజయవాడ నుంచి హైదరాబాద్ కు. ఇందుకు సంబంధించి ఈనెలాఖరు వరకు ప్రయాణీకులకు ఖుష్ కబర్ చెప్పారు ఎండీ.
అదేమిటంటే హైదరాబాద్ – విజయవాడ రూట్ లో వెళ్లే వారికి 10 శాతం టికెట్ లో రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ రాయితీ ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ రాయితీ ఏసీ, రాజధాని బస్సుల్లో మాత్రమే ఉంటుందని, కనీసం రూ. 40 నుంచి రూ. 50 దాకా మిగులుతుందని తెలిపారు ఎండీ.
Also Read : స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి కామెంట్స్
ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్-విజయవాడ రూట్లో 10 శాతం రాయితీని #TSRTC కల్పిస్తోంది. ఆ మార్గంలో వెళ్లే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ నెల ౩౦ వరకు 10 శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటుంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.40 నుంచి 50 వరకు ఆదా… pic.twitter.com/017vjug8T0
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 13, 2023