VC Sajjanar MD : మార్చిలో ఏసీ స్లీపర్ బస్సులు – ఎండీ
లహరి బస్సులను పరిశీలించిన సజ్జనార్
VC Sajjanar MD : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar MD) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రయాణీలకు శుభవార్త చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీ మెరుగైన సేవలు అందిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా మరింత ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించారు. సోమవారం లహరి ఏసీ స్లీపర్ బస్సులను బస్ భవన్ ప్రాంగణంలో పరిశీలించారు ఎండీ సజ్జనార్.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలనను అందించేందుకు గాను తొలిసారిగా టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశ పెట్టడం జరుగుతోందని తెలిపారు. మొదటి విడతగా మొత్తం 16 ఏసీ స్లీపర్ బస్సులను నడుపుతామని వెల్లడించారు. ఈ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు ఎండీ సజ్జనార్. వీటికి లహరి అని పేరు కూడా పెట్టడం జరిందని పేర్కొన్నారు. ట్రైన్లు, విమానాలకు తీసిపోని విధంగా ఈ బస్సులలో సౌకర్యాలు ఉంటాయని వెల్లడించారు ఎండీ.
వచ్చే నెలలో ఈ లహరి బస్సులను హైదరాబాద్ నుంచి బెంగళూరు, హుబ్లీ, విశాఖ పట్టణం , తిరుపతి, చెన్నై మార్గాలలో నడుపుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే తమ సంస్థ చేపట్టిన కార్గో సర్వీస్ కూడా అద్భుతంగా నడుస్తోందన్నారు. గతంలో ఉన్న ఇబ్బందులు మెల మెల్లగా తొలగి పోతున్నాయని తెలిపారు ఎండీ(VC Sajjanar MD).ప్రస్తుతం సిబ్బంది కూడా అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు.
Also Read : 21 నుంచి ‘గుట్ట’ ఉత్సవాలు