TSSPDCL : తెలంగాణ రైతుల‌కు విద్యుత్ షాక్

ఇక రోజుకు 7 గంట‌లు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా

TSSPDCL : నిన్న‌టి దాకా రైతుల సంక్షేమ ప్ర‌భుత్వం అని చెబుతూ వ‌చ్చిన తెలంగాణ స‌ర్కార్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. సాగు చేసిన అన్న‌దాత‌ల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. రోజుకు 7 గంట‌ల పాటు మాత్ర‌మే విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

దీని వ‌ల్ల వ్య‌వ‌సాయానికి తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది. ఇప్ప‌టి దాకా ఉచితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తోంది రైతుల‌కు. ఇక నుంచి ప్ర‌తి రోజూ రాత్రి 12 నుంచి ఉద‌యం 8 గంట‌ల దాకా సింగిల్ ఫేజ్ విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని టీఎస్ఎన్పీడీసీఎల్(TSSPDCL) ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దీంతో రైతులు దిక్కు తోచ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాల వారీగా దీనిని క‌చ్చితంగా పాటించాల‌ని పేర్కొంది. ప్ర‌తి ఏటా , ప్ర‌తిసారి సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల దాకా త్రీ ఫేజ్ విద్యుత్ స‌ర‌ఫ‌రాకు కోత పెడుతుంటారు.

రాష్ట్ర‌మంత‌టా కోత‌లు విధిస్తూ వ‌స్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో విద్యుత్ కొర‌త ఏర్ప‌డింది. 1500 మెగా వాట్ల దాకా కొర‌త ఉంటోంది. 14 ఏల 200 మెగా వాట్ల‌కు డిమాండ్ చేర‌డం విశేషం.

కొర‌త కంటిన్యూ కావ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాలో కోత విధిస్తూ వ‌స్తోంది. కాగా ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని కరెంట్ కోత‌లు తాత్కాలిక‌మేన‌ని , కొద్ది రోజుల్లో అంతా స‌ర్దుకుంటుంద‌ని అంటోంది తెలంగాణ విద్యుత్ సంస్థ‌.

ఇక డిమాండ్ కు త‌గ్గట్టు విద్యుత్ ను కొందామ‌న్నా దొర‌క‌డం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. విద్యుత్ కోత కార‌ణంగా పంట‌ల‌కు తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డ‌నుంది.

Also Read : సీజేఐ స‌హ‌కారం ప్ర‌శంస‌నీయం

Leave A Reply

Your Email Id will not be published!