TTD : కరోనా (Corona) దెబ్బకు రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి పెద్ద ఎత్తున భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం – టీటీడీ(TTD). నిన్నటి దాకా నిలిపి వేసిన ఆర్జిత సేవలకు అనుమతి ఇచ్చింది.
ఇప్పటికే పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరో వైపు వృద్దులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించింది టీటీడీ.
కరోనా (Corona) కారణంగా ఈ దర్శనాన్ని తిరిగి పునః ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపింది. ఆనాటి నుంచి నిన్నటి వరకు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు ఏకాంతంగానే జరుగుతున్నాయి.
శుక్రవారం నుంచి తిరిగి ఆర్జిత సేవలు ప్రారంభం అయ్యాయి. మరో సంచలన నిర్ణయం తీసుకుంది టీటీడీ(TTD). ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు వీలుగా ఆన్ లైన్ ద్వారా సేవా టికెట్లను (Tickets) విక్రయించనుంది.
తిరుమలలో శ్రీవారి కోసం సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం లాంటి ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ విధానం ద్వారా కేటాయిస్తూ వస్తోంది టీటీడీ.
ఇదిలా ఉండగా వృద్దులు, వికలాంగుల దర్శనం టోకెన్ల ఆన్ లైన్ ద్వారా ఏప్రిల్ 1 నుంచి విడుదల చేస్తామని ప్రకటించింది టీటీడీ. అనుకోకుండా ఈనెల 8కి వాయిదా వేశారు.
అయితే సాంకేతిక కారణాల రీత్యా టికెట్ల (Tickets) ను విడుదల చేయలేక పోయామంటూ తెలిపింది టీటీడీ. ఈ ఇబ్బందికి చింతిస్తున్నామని పేర్కొంది.
ఈనెల 8న ఉదయం 11 గంటలకు వృద్దులు, వికలాంగుల కోసం దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.
Also Read : నేర చరితులకు టీటీడీ పదవులా