TTD Booking : 24న వృద్దులు..దివ్యాంగులకు టికెట్లు విడుదల
ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలన్న టీటీడీ
TTD Booking : తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ప్రత్యేకించి గత కొంత కాలంగా నిలిపి వేసిన అన్ని దర్శనాలను తిరిగి పునరుద్దరించింది. ఇటీవల సమావేశమైన టీటీడీ పాలక మండలి ప్రధానంగా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కరోనా కారణంగా అర్దాంతరంగా నిలిపి వేసిన వృద్దులు, చంటి పిల్లల తల్లులు, దివ్యాంగులకు సంబంధించిన దర్శనాలను తిరిగి పునరుద్దరించాలని తీర్మానం చేసింది.
ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఈ విషయాన్ని ప్రత్యేకంగా వెల్లడించారు. ఇందులో భాగంగా టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు ఈనెల 24న గురువారం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. వయో వృద్దులు, దివ్యాంగుల దర్శనం టికెట్లు విడుదల చేయనుంది.
వీరితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను టీటీడీ(TTD Booking) ఆరోజు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వీరికి సంబంధించిన ప్రత్యేక కోటాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.
తిరుమల శ్రీవారిని దర్శించు కునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి అధికారికంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన వెబ్ సైట్ లోనే బుకింగ్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.
అంతే కాకుండా నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్దులు, దివ్యాంగులకు , 5 ఏళ్ల లోపు చంటి పిల్లల పేరెంట్స్ కోసం టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రతి నెలా రెండు రోజులు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. మరో వైపు శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది.
Also Read : భాగ్యనగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్