TTD Calendars Diaries : శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త

2023 క్యాలెండ‌ర్లు, డైరీలు ల‌భ్యం

TTD Calendars Diaries : ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు తిరుమ‌లలో కొలువై ఉన్న శ్రీ వేంక‌ట్వేర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను కొలుస్తారు. ప్ర‌తి రోజూ క‌నీసం 80 వేల మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నారు. వేల కోట్ల ఆదాయం, బంగారం క‌లిగి ఉన్న క‌లియుగ వైకుంఠంగా పేరొందింది.

ఇప్ప‌టికే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అనేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌త్యేకించి సుదూర ప్రాంతాల నుంచి నిత్యం ద‌ర్శనం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు వ‌స‌తి, ద‌ర్శ‌న సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు. బ్రేక్, వీఐపీ, వీవీఐపీల ద‌ర్శ‌నాల స‌మ‌యాల‌ను కూడా మార్చేసింది. ఒక్కోసారి సెలవుల స‌మ‌యంలో ల‌క్ష మంది వ‌ర‌కు భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నారు తిరుమ‌ల‌ను.

దీంతో భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం ఇబ్బందిగా మారింది టీటీడీకి. ఈసారి టీటీడీ పాల‌క‌మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో క‌రోనా కార‌ణంగా ర‌ద్దు చేసిన వృద్దులు, చంటి పిల్ల‌ల త‌ల్లులు, విక‌లాంగుల‌కు ద‌ర్శ‌న భాగ్యాన్ని పున‌రుద్ద‌రించింది.

ఇక ఎప్ప‌టి టాగే టీటీడీ ప్ర‌తి ఏటా వేలాదిగా స్వామి వారికి, తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి సంబంధించిన క్యాలెండ‌ర్లు, డైరీల‌ను(TTD Calendars Diaries) విడుద‌ల చేస్తుంది. తాజాగా టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

వ‌చ్చే ఏడాది 2023 సంవ‌త్స‌రానికి సంబంధించి కొత్త‌గా క్యాలెండ‌ర్లు, డైరీల‌ను అందుబాటులోకి తీసుకు వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించింది. హైద‌రాబాద్ , తిరుమ‌ల‌, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, బెంగ‌ళూరు, చెన్నై , ముంబై , ఢిల్లీలోని టీటీడీ స‌మాచార కేంద్రాల్లో విక్ర‌యిస్తుంది.

టీటీడీ వైబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. అంతే కాకుండా ఈవో పేరుతో డీడీలు పంపి డైరీలు, క్యాలెండ‌ర్లు పొందే సౌక‌ర్యం కూడా ఉంద‌ని స్ప‌ష్టం చేసింది టీటీడీ.

Also Read :  వృద్దులు..దివ్యాంగుల‌కు టికెట్లు విడుద‌ల

Leave A Reply

Your Email Id will not be published!