TTD Cancel : 19న బ్రేక్ దర్శనాలు రద్దు
18న సిఫార్సు లేఖలు స్వీకరించబోం
TTD Cancel : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలకు ఓర్చి పుణ్య క్షేత్రానికి వస్తున్నారు. ఇదిలా ఉండగా కోలుకోలేని షాక్ ఇచ్చింది టీటీడీ. ఈ మేరకు భక్తులకు కీలక సూచన చేసింది. ఇందులో భాగంగా ఈనెల 19న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
TTD Cancel Break Darshan
అంతే కాకుండా ఈనెల 18న సిఫార్సు లేఖలు స్వీకరించ బడవని పేర్కొంది టీటీడీ. ఆలయంలో డిసెంబర్ 23 నుండి వచ్చే ఏడాది 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కారణంగా 19న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఈనెల 19న శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ(TTD) రద్దు చేసింది. ఈ కారణంగా సోమవారం సిఫారసుల లేఖలు స్వీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని శ్రీనివాసుడి భక్త బాంధవులు గమనించాలని, తమతో సహకరించాలని కోరింది టీటీడీ.
ఇదిలా ఉండగా వైకుంఠ ఏకాదశి ఉండడంతో ఈనెల 23 నుంచి తిరుమలకు భక్తులు భారీగా తరలి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది పాలక మండలి.
Also Read : Chandra Babu Naidu : ఆ ఇద్దరి త్యాగం చిరస్మరణీయం