TTD Chairman : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమలను దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేతి కర్రలను పంపిణీ చేశారు. క్రూర మృగాల సంచరిస్తుండడంతో ముందస్తుగా వీటిని ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెంచినట్లు చెప్పారు.
TTD Chairman Hand Sticks Distributed
అలిపిరి పాదాల మండపం వద్ద ఈవో ఏవీ ధర్మా రెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) నడకదారి భక్తులకు చేతి కర్రలను అందజేశారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. చేతి కర్రలు ఉంటే క్రూర మృగాల నుంచి రక్షించుకునే వీలు ఉంటుందన్నారు.
భక్తులను ఒక్కొరొక్కరుగా కాకుండా గుంపులుగా పంపుతున్నామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అడుగడుగునా పోలీసులు కూడా ఉంటారని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్నారని స్పష్టం చేశారు.
చేతి కర్రల పంపిణీకి సంబంధించి విమర్శలు చేస్తున్న వారి పట్ల తాను ఎలాంటి కామెంట్స్ చేయదల్చు కోలేదన్నారు. చేతి కర్రలను భక్తులకు ఉచితంగా అందజేస్తామన్నారు. వీటిని తిరుమల కొండపై ఉన్న శ్రీ నరసింహ స్వామి వారి ఆలయం వద్ద తిరిగి తీసుకుంటారని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : Sajjala Ramakrishna Reddy : బాబు అరెస్ట్ కాక తప్పదు
