TTD Chairman : వసతుల కల్పనపై భూమన ఆరా
తానే భక్తులకు ప్రసాదం అందజేత
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాక భక్తుల వసతుల కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా రోజు రోజుకు తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 70 వేలకు తక్కకుండా దర్శించుకుంటున్నారు.
TTD Chairman Checking
తిరుమల ఆలయానికి భారీ ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. కనీసం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4 కోట్లకు పైగా వస్తోంది. తండోప తండాలుగా వస్తున్న భక్తులకు అత్యంత త్వరగా దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. భూమన పదే పదే సామాన్య భక్తులకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తామని స్పష్టం చేశారు.
తాజాగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2లో సర్వ దర్శనం భక్తుల కోసం టీటీడీ(TTD) కల్పించిన వసతి , సౌకర్యాల గురించి పరిశీలించారు. ఆయనే స్వయంగా భక్తులకు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగారు. తాగు నీరు, కాఫీ, టీ వంటివి ఇస్తున్నారా లేదా అన్న దానిపై ఆరా తీశారు. భక్తులకు సరి పోయేంతగా ప్రసాదాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు.
క్యూ కాంప్లెక్స్ లోకి ఎన్ని గంటలకు వచ్చారు. దర్శనానికి ఎంత సమయం పడుతోందని అడిగి తెలుసుకున్నారు.
Also Read : Chandrababu Naidu : ఏపీ రాజధాని పోలవరం