TTD Chairman : సీఎం ఆదేశం కళ్యాణమస్తు పునః ప్రారంభం
వెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
TTD Chairman : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భక్తి ఎక్కువ. ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ముచ్చింతల్ లో జరిగిన శ్రీ రామానుజ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరయ్యారు.
చిన్న జీయర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శారదా పీఠంను దర్శించుకున్నారు. స్వామి పరిపూర్ణానందేంద్ర స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలను కూడా దర్శించుకున్నారు.
సీఎం ఆదేశాల మేరకు తిరుమల భక్తులకు మరిన్ని అదనపు సౌకర్యాలను కల్పించేలా చర్యలు చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. తాజాగా శుభవార్త చెప్పారు.
పేద వారికి అండగా ఉండేందుకు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం టీటీడీ చైర్మన్(TTD Chairman) అభిషేకం సేవలో పాల్గొన్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 7వ తేదీన 26 జిల్లాల్లో కళ్యాణ మస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఆరోజు ఉదయం 8 నుంచి 8.17 నిమిషాల మధ్య ముహూర్తం పండితులు నిర్ణయించారని తెలిపారు టీటీడీ చైర్మన్.
ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల్లో వివాహ జంటలు రిజిస్ట్రేషన్ చేయించు కోవాలని వైవీఎస్ సూచించారు.
ఇతర రాష్ట్రాల సీఎంలు ముందుకు వస్తే ఆయా ప్రాంతాల్లో కూడా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీటీడీ(TTD Chairman) సిద్దంగా ఉందని ఈ సందర్భంగా ప్రకటించారు.
Also Read : అయోధ్యలో గర్భగుడి పనులకు శ్రీకారం