TTD Chairman : ఆల‌యాల‌ను ద‌ర్శించుకున్న భూమ‌న‌

గోవింద రాజ‌స్వామి, కోదండ రామ స్వామి ఆల‌యం

TTD Chairman : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తొలిసార బుధ‌వారం తిరుప‌తి లోని శ్రీ గోవింద రాజ స్వామి దేవాల‌యం, శ్రీ కోదండ రామ‌స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఆయా ఆల‌యాల‌లో అర్చ‌కులు టీటీడీ(TTD) చైర్మ‌న్ భూమ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆశీర్వ‌చ‌నం, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. జేఈవో వీర బ్ర‌హ్మం టీటీడీ చైర్మ‌న్ ను శాలువా తో స‌త్క‌రించారు.

TTD Chairman Visit Temples

ఇదిలా ఉండ‌గా టీటీడీ చైర్మ‌న్ గా కొలువు తీరిన వెంట‌నే కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమ‌ల ఆధీనంలోని అన్ని ఆల‌యాల‌లో భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా అద‌న‌పు సౌక‌ర్యాలు ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక నిత్యం వేలాది మంది క‌లియుగ దైవంగా భావించే శ్రీ‌వారిని ద‌ర్శించు కునేందుకు త‌ర‌లి వ‌స్తుంటార‌ని వారికి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పారు టీటీడీ చైర్మ‌న్. టీటీడీ ఉద్యోగులంద‌రికీ ఇంటి స్థ‌లాల‌ను ఇస్తామ‌న్నారు. సెప్టెంబ‌ర్ 18న సీఎం జ‌గ‌న్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడ‌తార‌ని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంట‌నే త‌న‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు.

Also Read : Auyutha Atirudra Yagam : అతిరుద్ర యాగం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Leave A Reply

Your Email Id will not be published!