TTD EO : తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు
రేపటి నుండి 23వ తేదీ వరకు ఉత్సవాలు
TTD EO : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు టీటీడీ అంకురార్పణ చేయనుంది. ఉత్సవాలు ఈనెల 23 వరకు జరగనున్నాయి.
ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసింది. శనివారం, ఆదివారం సర్వ దర్శనాలను కూడా రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలను నిలిపి వేసినట్లు పేర్కొన్నారు.
TTD EO Words about Events
ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 19న గరుడ సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణ రథం, 23న చక్ర స్నానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈవో. ఉదయం వాహన సేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. గరుడ వాహన సేవ రాత్రి 7 గంటల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. అర్ధరాత్రి 12 గంటల దాకా దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఉత్సవాల సందర్భంగా అష్ట దళ పాద పద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశామన్నారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహన సేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబరు 19న గరుడ సేవ కారణంగా ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాక పోకలను రద్దు చేశామన్నారు.
Also Read : Gudivada Amarnath : రామోజీ రావు దుర్మార్గుడు – అమర్నాథ్