TTD Tickets : శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త

టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుద‌ల

TTD Tickets : శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభ‌వార్త చెప్పింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)(TTD Tickets) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మల ద‌ర్శ‌నం చేసుకునేందుకు గాను టికెట్ల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. వ‌చ్చే నెల న‌వంబ‌ర్ నెల‌కు సంబంధించి అంగ ప్ర‌ద‌క్షిణ టోకెన్ల కోటాను 21 ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్ లైన్ లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది టీటీడీ.

అదే విధంగా డిసెంబ‌ర్ నెల‌కు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల‌ను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. ఈ టికెట్ల‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

అంతే కాకుండా డిసెంబ‌ర్ నెల‌కు సంబంధించి ఆర్జిత సేవ‌ల‌ను ఆన్ లైన్ లక్కీ డిప్ లో 22న ఉద‌యం 10 గంట‌ల నుండి అందుబాటులో ఉంచుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. శ్రీ‌వారి భ‌క్తులు ఈ స‌ద‌వ‌కాశాన్ని ఉప‌యోగించు కోవాల‌ని కోరింది.

ఈనెల 24న దీపావ‌ళి ఆస్థానం, 25న సూర్య గ్ర‌హ‌ణం ఉండ‌డంతో పాటు న‌వంబ‌ర్ 8న చంద్ర‌గ్ర‌హ‌ణం రావ‌డంతో ఆ మూడు రోజుల్లో బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు ఇప్ప‌టికే టీటీడీ(TTD) ప్ర‌క‌టించింది. ఆ స‌మ‌యంలో కేవ‌లం ప్రోటోకాల్ ఉన్న వారికి మాత్ర‌మే ద‌ర్శ‌నాలు ఉంటాయ‌ని వేరే వారికి ఉండ‌వ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది టీటీడీ.

మ‌రో వైపు ఎవ‌రైనా టికెట్లు విక్ర‌యిస్తామ‌ని చెబితే న‌మ్మ‌వ‌ద్ద‌ని పూర్తిగా అధికారికంగా టీటీడీ ఆన్ లైన్ సైట్ లోనే టికెట్లు కొనుగోలు చేయాల‌ని సూచించింది.

Also Read : దీపావ‌ళి సెల‌వు రోజు 25 కాదు 24

Leave A Reply

Your Email Id will not be published!