TTD JEO : విస్తృతంగా టీటీడీ పరిశోధనలు – జేఈవో
తాళపత్రాల్లోని విషయాలు వెలుగలోకి
TTD JEO : భారతీయ విజ్ఞానం దాగి ఉన్న తాళపత్రాల్లోని విషయాలను నేటి తరానికి అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిశోధనలు చేస్తోందని జేఈవో సదా భార్గవి స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో డిజిటలైజేషన్ టెక్నాలజీస్ పై 2 రోజుల జాతీయ స్థాయి సెమీనార్ శనివారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శ్రీ వేంకటేశ్వర మాన్యు స్క్రిప్ట్ ప్రాజెక్టు ద్వారా దేశం నలుమూల నుండి తాళపత్రాలు సేకరించడం జరుగుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పారు సదా భార్గవి.
దీని వల్ల 500 సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరకుండా ఉంటాయని స్పష్టం చేశారు జేఈవో. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులు, సంస్థలు తమ వద్ద తాళ పత్రాలు ఏవైనా ఉంటే మాన్యూ స్క్రిప్టు ప్రాజెక్టు కు తెచ్చి వాటిని డిజిటలైజ్ చేసుకొని వెళ్లవచ్చని తెలిపారు.
కాగా భావి తరాలకు ఉపయోగపడేలా తాళపత్రాలను పుస్తక రూపంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు సదా బార్గవి. టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మారెడ్డి మార్గదర్శనంలో ఈ ప్రాజెక్టు ఏడాది కాలంగా అద్భతుంగా పని చేస్తందని అన్నారు. సనాతన జీవన్ ట్రస్ట్ సహకారంతో తాళ పత్రాల డిజిటలైజేషన్ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఉప కులపతి ఆచార్య కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Also Read : Ambati Rambabu : పవన్ ప్యాకేజీ స్టార్ – అంబటి రాంబాబు
