TTD Laddu Vada : విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదం
నవంబర్ 15 వరకు కొనసాగుతున్న పంపిణీ
TTD Laddu Vada : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి ఆధ్వర్యంలో టీటీడీలో పని చేస్తూ పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగా ఈనెల 15 వరకు ఉచితంగా శ్రీవారి లడ్డూ, వడను పంపిణీ చేస్తూ వస్తోంది. అంతే కాకుండా కుటుంబ ఫించన్ దారులకు కూడా వీటిని అందజేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఈనెల నవంబర్ 1 నుంచి ప్రారంభమైంది.
TTD Laddu Vada for Staff
తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) క్యాంటీన్ వద్ద ఉన్న కొత్త జాబిలి భవనలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఫించన్ దారులు తమ స్మార్టు కార్డు చూపి శ్రీవారి పెద్ద లడ్డూ, ఒక వడ ఇస్తున్నారు.
పీపీఓ నంబర్ల వారీగా ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. నవంబర్ 1,2 వ తేదీలలో 164 నుండి 3,395 నంబర్ల వరకు పెన్షన్ దారులకు, విశ్రాంత ఉద్యోగులకు పంపిణీ చేశారు. 3, 4వ తేదీల్లో 3,397 నుండి 5,078 వరకు, 6న 5,079 నుండి 6,522 వరకు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఇక 7, 8వ తేదీల్లో 6,523 నుండి 7,826 వరకు, 9, 10వ తేదీల్లో 7,827 నుండి 9,064 వరకు, 13, 14వ తేదీల్లో 9,065 నుండి 10,215 వరకు, 15న 10,216 నుండి మిగిలిన పింఛన్దారులందరికీ ప్రసాదాలు అందజేయనున్నారు. అంతే కాకుండా 12 పేజీల టీటీడీ క్యాలెండర్లను పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో ఉచితంగా పొందాలని టీటీడీ తెలిపింది.
Also Read : Gudivada Amarnath : ఎన్నికల వేళ ఏపీపై విమర్శలేల