TTD Darshan : శ్రీవారి భక్తులకు తీపి కబురు – టీటీడీ
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రిలీజ్
TTD Darshan : శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీనివాసుడికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. స్వామి, అమ్మ వార్లను దర్శించు కునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక సెలవు, పండుగల రోజుల్లో అయితే భక్తులను ఆపడం ఎవరి తరం కావడం లేదు. దీంతో టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.
రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వీఐపీల దర్శనాలు బంద్ చేస్తోంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు. ఇదిలా ఉండగా ఆన్ లైన్ లో , ఆఫ్ లైన్ లో శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది. అదేమిటంటే ప్రత్యేక దర్శనం (స్పెషల్ దర్శన్ )(TTD Darshan) కోసం ఈనెల 13న టికెట్లను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు సంబంధించిన రూ. 300 రూపాయల ప్రవేశ దర్శనం కోటా టికెట్లను 13న అంటే సోమవారం రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. అంతే కాకుండా మార్చి నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లను ఈనెల 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటాను ఈనెల 11న ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
సో..భక్త బాంధవులు..ఈ సదవకాశాన్ని వినియోగించు కోవాలని కోరింది టీటీడీ. అబద్దపు ప్రచారాన్ని నమ్మ వద్దంటూ కోరింది. టీటీడీ కీలక ప్రకటన చేసింది. నియామలను అనుసరించి వస్త్రాలను ధరించాలని సూచించింది. లేకపోతే దర్శనం ఉండదని పేర్కొంది.
Also Read : సన్యాసిలా ఆలోచిస్తే జీవితం సంతోషం