TTD Rush : పుణ్య క్షేత్రం భక్తుల సందోహం
దర్శించుకున్న భక్తులు 78,389
TTD Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తుల బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) . చిన్నారులు, తల్లులు, వృద్దులకు ఉన్న చోటనే శ్రీవారి జల, ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్నారు స్వామి వారి సేవకులు.
TTD Rush with Devotees
ఇదిలా ఉండగా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 78 వేల 389 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 466 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ(TTD) స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా భక్తులు నిత్యం కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.87 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
తిరుమల లోని 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఇక ఎలాంటి టోకెన్లు లేని భక్తలకు సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 8 గంటలకు పైగా సమయం పట్టనుందని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
Also Read : TTD Laddu Vada : విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదం