TTD Closed : శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం ప్రభావం
TTD Closed : మొన్న సూర్య గ్రహణం ఇవాళ చంద్రగ్రహణంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూత పడ్డాయి. తాజాగా ఏపీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలుమంగ ఆలయాన్ని మూసి వేశారు(TTD Closed). ఇప్పటికే భక్తులకు సమాచారాన్ని అందజేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
రెండో సారి ప్రధాన ఆలయం మూసి వేయడం. చంద్రగ్రహణం ప్రభావం కారణంగా స్వామి, అమ్మ వార్లకు సంబంధించి తెరిచి ఉంచ కూడదని శాస్త్రం చెబుతోందంటూ టీటీడీ పేర్కొంది. ఇది గత కొంత కాలం నుంచి కొనసాగుతూ వస్తోందని పేర్కొంది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.40 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేసింది టీటీడీ.
రాత్రి 7.20 గంటల వరకు గ్రహణం ఉంటుందని వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. చంద్ర గ్రహణం పూర్తయిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని తిరిగి తెరుస్తామని తెలిపారు టీడీడీ ఈవో ధర్మారెడ్డి. అనంతరం ఆలయాన్ని, స్వామి, అమ్మ వార్లను శుద్ది చేస్తామని ఆ తర్వాతే భక్తులకు దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
ఇక చంద్ర గ్రహణం కారణంగా వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ (వీఐపీ) బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. దీని ప్రకారం ఇందుకు సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. వీటితో పాటు ఇంతకు ముందు నిర్వహించే పూజలు కూడా నిలిపి వేస్తామన్నారు.
అంతే కాకుండా ఆర్జిత సేవలు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. పూజలు ముగిసిన తర్వాతే భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది.
Also Read : పాపికొండల్లో పారా హుషార్