TTD Utsavalu : 12 నుంచి శ్రీవారి అధ్యయనోత్సవాలు
జనవరి 5వ తేదీ వరకు ఉత్సవాలు
TTD Utsavalu : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు బారులు తీరారు.
TTD Utsavalu Updates
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD) ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసింది. శ్రీవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 12 నుంచి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ వెల్లడించింది.
ప్రతి ఏటా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ అధ్యయనంగా పిలుస్తారు. దీని ద్వారా ఈ అధ్యయనోత్సవం ప్రారంభం అవుతుంది.
ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠి గానం చేస్తారు. ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహ స్వామి వారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.
Also Read : Vivek Venkata Swamy : ప్రజా పాలన మొదలైంది