Tula Uma : వేములవాడ – ఆఖరు నిమిషంలో భారతీయ జనతా పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. వేములవాడ నియోజకవర్గంలో ఉద్యమకారిణిగా పేరు పొందిన తుల ఉమ(Tula Uma)కు తొలుత టికెట్ కేటాయించారు. ఆమె మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరురాలిగా గుర్తింపు పొందారు. నవంబర్ 10న దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు కావడంతో ఉన్నట్టుండి తుల ఉమకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి బీ ఫామ్ మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావుకు చెందిన కుటుంబీకునికి టికెట్ ఖరారు చేసింది.
Tula Uma Emotional
ఈ సందర్బంగా తనకు సమాచారం ఇవ్వకుండానే ఎలా టికెట్ మారుస్తారంటూ ప్రశ్నించింది తుల ఉమ. మహిళా రిజర్వేషన్లకు అర్థం అంటే ఇదేనా అని నిలదీశారు. ప్రజల కోసం పని చేసే వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని మండి పడ్డారు. తాను విప్లవ ఉద్యమంలో పని చేయడం తప్పు ఎలా అవుతుందంటూ పేర్కొన్నారు .
బీసీల జపం చేస్తున్న భారతీయ జనతా పార్టీ తన పట్ల ఎందుకు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు . తొలుత సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారని ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు మార్చారో చెప్పాలని అన్నారు. తనకు టికెట్ ఇవ్వక పోయినా ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు.
Also Read : Raja Gopal Reddy : అభ్యర్థుల ఆస్తుల్లో కోమటిరెడ్డి టాప్