Tula Uma : కారెక్క‌నున్న తుల ఉమ..?

వినోద్ కుమార్ మంత‌నాలు

Tula Uma : వేముల‌వాడ – బీజేపీ లిస్టులో టికెట్ ద‌క్కించుకుని చివ‌ర‌కు బీ ఫామ్ కోల్పోయిన క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌రిష‌త్ మాజీ చైర్ ప‌ర్స‌న్ తుల ఉమ కారెక్క‌నున్నారా. అవున‌నే అంటున్నారు ఆమె అనుచ‌రులు. త‌న జీవితమంతా ఉద్య‌మ నేప‌ధ్యంతో ముడి ప‌డి ఉంది. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు.

Tula Uma May be Join in BRS

ఇదిలా ఉండ‌గా బీఆర్ఎస్ తో విభేదించారు. మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ అనుచ‌రురాలిగా గుర్తింపు పొందారు. బీజేపీలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో తుల ఉమ(Tula Uma ) తాను బ‌రిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆమెను తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని గంట‌ల కొద్దీ తుల ఉమ‌తో చ‌ర్చోప చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తుల ఉమ‌తో ఫోన్ లో మాట్లాడిన‌ట్లు స‌మాచారం.

కాసేప‌ట్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి చ‌ల్మెడ ల‌క్ష్మీ న‌ర‌సింహారావు తో పాటు వినోద్ కుమార్ తుల ఉమ ఇంటికి బ‌య‌లు దేరార‌ని, ఎలాగైనా స‌రే బీఆర్ఎస్ లో చేరాల‌ని కోరార‌ని ఇందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు టాక్.

ఇవాళో రేపో మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో తుల ఉమ గులాబీ కండువా క‌ప్పుకోనున్నారు.

Also Read : DK Shiva Kumar : తెలంగాణ‌లో కాంగ్రెస్ విప్ల‌వం

Leave A Reply

Your Email Id will not be published!