Tula Uma : వేములవాడ – బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో బీ ఫామ్ ఇవ్వకుండా తనను అవమానించడంపై నిప్పులు చెరిగారు ప్రముఖ ఉద్యమకారిణి, ప్రజా నాయకురాలిగా గుర్తింపు పొందిన తుల ఉమ. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏం ముఖం పెట్టుకుని బీజేపీ నాయకులు తన వద్దకు వస్తారని ప్రశ్నించారు. ఎవరు వచ్చిన సరే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఎవరో చెప్పితే తనను బొంద పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.
Tula Uma Serious Comments
నాలాంటి ప్రజల కోసం పని చేసిన వ్యక్తిని మోసం చేసినందుకు సిగ్గు పడాల అని అన్నారు. నర నరాన దొర మనస్తత్వం ఉన్న దొరకు ఎలా టికెట్ ఇస్తారంటూ ప్రశ్నించారు. ఒక మహిళనని చూడకుండా టికెట్ కేటాయించి చివరకు మార్చడం దారుణమన్నారు.
తన వద్దకు వచ్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. చివరకు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని ఏకి పారేశారు. పార్టీ హైకమాండ్ ఏం చేస్తోందంటూ నిలదీశారు. ఇదేనా బీసీ పార్టీ నినాదం అని మండిపడ్డారు. మహిళలకు మీరు ఇచ్చే గౌరవం, గుర్తింపు ఇదేనా అన్నారు తుల ఉమ(Tula Uma). తనను తక్కువ అంచనా వేశారని , ఎన్ని రకాలుగా చెప్పినా తాను వినని స్పష్టం చేశారు. ఒంటరిగానే తాను పోటీ చేస్తున్నానని చెప్పారు.
Also Read : AP CM YS Jagan : మైనార్టీల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం