Tummala KCR : తుమ్మ‌ల కేసీఆర్ ను మ‌రిచి పోతే ఎలా

ప‌లుమార్లు ఛాన్స్ ఇచ్చినా నో యూజ్

Tummala KCR : హైదరాబాద్ – సీఎం కేసీఆర్ ప‌లుమార్లు చాన్స్ ఇచ్చినా స‌ద్వినియోగం చేసుకోలేక పోయారు మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీ వైపు చూడ‌డం మింగుడు ప‌డ‌డం లేదు. ఖ‌మ్మం జిల్లాలో మంచి ప‌ట్టు క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

Tummala KCR Relation

తుమ్మ‌ల‌కు ఉన్న రాజ‌కీయ అనుభ‌వం, వ‌య‌సును గౌర‌వించారు సీఎం కేసీఆర్. 2014లో బీఆర్ఎస్ పార్టీలోకి రావాల‌ని ఆహ్వానం ప‌లికారు. సంవ‌త్స‌రం తిరిగే లోపే 2015లో ఎమ్మెల్సీని చేశారు. ఆపై త‌న కేబినెట్ లో మంత్రిగా అవ‌కాశం క‌ల్పించారు.

2016లో పాలేరు ఉప ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావుకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తానే అన్నీ అయి వ్య‌వ‌హ‌రించారు. తుమ్మ‌ల‌ను(Tummala Nageswara Rao) గెలిపించుకున్నారు. ఆ త‌ర్వాత ఖ‌మ్మం జిల్లాను తుమ్మ‌ల చేతిలో పెట్టారు సీఎం.

పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ఇచ్చి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన కేసీఆర్ ను కాద‌న్నారు. 2018లో తిరిగి పాలేరు నుండి బ‌రిలోకి దింపేలా చేశారు కేసీఆర్. అయినా ఓట‌మి పాల‌య్యారు. త‌న ఓట‌మికి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కార‌ణ‌మంటూ ఆనాడు ఆరోపించారు.

తిరిగి ఇవాళ అదే పొంగులేటి చేరిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఏది ఏమైనా కేసీఆర్ ను విస్మ‌రిస్తే ఎలా అని బీఆర్ఎస్ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి.

Also Read : KC Venugopal : కాంగ్రెస్ స‌భ ఏర్పాట్ల‌పై కేసీ ఆరా

Leave A Reply

Your Email Id will not be published!