Turkey Changes : టర్కీ పేరు మార్పుపై యుఎన్ ఓకే
బ్రాండ్ వాల్యూ పెంచుకునేందుకే
Turkey Changes : పేరులో అక్షరాలు మార్చుకుంటే భవిష్యత్తు మారుతుందని కొందరి నమ్మకం. ఇక భారత దేశంలో మూఢ నమ్మకాలకు పెట్టింది పేరు. ఈ దేశంలో న్యూమరాలజిస్టులకు ఉన్నంత డిమాండ్ ప్రపంచంలో ఎక్కడా లేదంటే నమ్మలేం.
ప్రధానంగా క్రీడాకారులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ రంగానికి చెందిన నేతలు సంఖ్యా శాస్త్ర నిపుణులను సంప్రదించడం పరిపాటి. చాలా మంది తమ పేర్లల్లో అక్షరాలు మార్చుకున్న వారు ఎందరో ఉన్నారు.
ప్రముఖ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. ఇక తాజాగా ఓ సంఘటన విస్తు పోయేలా చేసింది. అదేమిటంటే టర్కీ(Turkey Changes) దేశం తన పేరును మార్చుతున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు దేశ చట్ట సభలో తీర్మానం కూడా చేసింది. ఇదే విషయాన్ని తమ దేశంలో మార్పు చేసిన విషయం గురించి అన్ని దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఐక్య రాజ్య సమితికి దరఖాస్తు చేసుకుంది.
దయచేసి తాము తమ దేశపు పేరును మార్చామని గుర్తించి సహకరించ గలరని కోరింది. భారత్ జాడ్యం ఏకంగా ఇప్పుడు టర్కీకి పాకిందన్న మాట. విచిత్రం ఏమిటంటే ఈ దేశం చెప్పిన కారణం భిన్నంగా ఉంది.
తమ దేశం బ్రాండ్ వాల్యూ పెరిగేందుకే తాము పేరు మార్చామని తెలిపింది. గతంలో ఆ దేశాన్ని టర్కీని(Turkey) అని పిలుస్తూ వచ్చారు.
కాగా ఇక నుంచి తమ దేశాన్ని తుర్కై Türkiye అని పిలువాలంటూ కోరుతూ యుఎన్ చీఫ్ ఆంటినియో గుటెర్రస్ కు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కవసాగ్లూ లేఖ రాశారు. ఈ మేరకు తుర్కై సర్కార్ పంపిన లేఖను తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు యున్ చీఫ్.
Also Read : చమురు దిగుమతులు సబబే – జై శంకర్