Rana Ayyub : రానా అయ్యూబ్ కు ట్విట్టర్ బిగ్ షాక్
ఖాతా విత్ హోల్డ్ లో ఉంచినట్లు ప్రకటన
Rana Ayyub : భారత దేశంలో పేరొందిన జర్నలిస్టులలో రానా అయ్యూబ్ ఒకరు. ఆమె ట్విట్టర్ ఖాతాను విత్ హోల్డ్ లో ఉంచినట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది.
ఈ మేరకు భారత దేశ చట్టాల ప్రకారం ట్విట్టర్ బాధ్యతలకు లోబడి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం రానా అయ్యూబ్ ఖాతాను నిలిపి వేయాల్సి వచ్చిందని వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి నెలలో రానా అయ్యూబ్ పై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఆమె ఖాతా లో ఉన్న రూ. 1.77 కోట్లు స్తంభింప చేసింది భారత ప్రభుత్వం. ఇదే విషయాన్ని జర్నలిస్ట్ రాణా అయ్యూబ్ (Rana Ayyub) తెలిపారు.
ఇదేమిటి అంటూ ఆమె ప్రశ్నించారు ట్విట్టర్ ను. అయితే దీనికి ట్విట్టర్ కూడా ఘాటుగా జవాబు ఇచ్చింది. తాము ఎవరి పట్లా వివక్ష చూపించమని, కానీ ఆయా దేశాల చట్టాలకు లోబడి తాము నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది.
ఇందులో భాగంగానే అక్కడి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్విట్టర్ పేర్కొంది. ఇదిలా ఉండగా జర్నలిస్ట్ రానా అయ్యూబ్ చేసిన ట్వీట్ కు స్పందించారు టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవా.
ఇవాళ జర్నిలస్ట్ ను విత్ హోల్డ్ లో పెట్టారు. రేపు ఇంకెవరిని చేర్చ బోతున్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం టెన్నిస్ లెజెండ్ చేసిన కామెంట్ కలకలం రేపుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రసార భారతి మాజీ సిఇఓ కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి మెయిల్ తనకు కూడా ఒకటి వచ్చిందన్నారు.
Also Read : సోషల్ మీడియాలో ఫేస్ బుక్ టాప్