Elon Musk Replaces : ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగో మార్పు
డోగ్ మెమోతో భర్తీ చేసిన మస్క్
Elon Musk Replaces : టెస్లా చైర్మన్ ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్ చేతిలోకి వచ్చాక కీలక మార్పులు చేశాడు. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాడు. టాప్ పొజిషన్ లో ఉన్న వారికి మంగళం పాడాడు. తాజాగా ట్విట్టర్ లో బ్లూ టిక్ మార్క్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ట్విట్టర్ కు సంబంధించి కొత్త లోగోతో పాటు మొబైల్ యాప్ లో ఎటువంటి మార్పు చేయలేదు.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగోను డోగ్ మెమెతో భర్తీ చేశాడు. ట్విట్టర్ వినియోగదారులు డాగ్ కోయిన్ బ్లాక్ చెయిన్ లోగోలో భాగమైన డోజ్ మెమెను చేర్చాడు ఎలోన్ మస్క్(Elon Musk Replaces). ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను పూర్తిగా మార్చేశాడు.
వెబ్ వెర్షన్ లో హోమ్ బటన్ గా డోగ్ తో పని చేస్తుంది. 2013లో జోక్ గా సృష్టించబడిన డాగ్ కోయిన్ బ్లాక్ చెయిన్ , క్రిప్టో కరెన్సీ లోగోలో భాగమైన డోజ్ మెమెపై యూజర్లు విస్తు పోయారు.
రాబోయే రోజుల్లో ట్విట్టర్ సిఇఓ ఎలాన్ మస్క్(Elon Musk) ఇంకెన్ని మార్పులు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మస్క్ తన ఖాతాలో ఒక ఉల్లాసమైన పోస్ట్ ను కూడా పంచుకోవడం ఆసక్తిని రేపింది. సిఇఓ మార్చి 26, 2022 నాటి స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నారు. మస్క్ కు గుర్తించబడని యూజర్ కు మధ్య సంభాషణలో ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగోను మార్చే విషయంపై పంచుకున్నారు.
Also Read : పాక్ స్టార్ ఉసామా ఊచకోత