Twitter Blue Tick : మస్క్ షాక్ బ్లూ టిక్ కు ఫీజు
ఇక నుంచి నో ఫ్రీ ఓన్లీ ఫీ
Twitter Blue Tick : ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఉన్న టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్(Elon Musk) ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. కష్టం విలువ ఏమిటో తెలుసుకున్న వాడు కాబట్టే ఇప్పుడు గాడి తప్పిన ట్విట్టర్ ను దారిలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నాడు మస్క్. లక్షల కోట్ల సంపద ఉన్నా చిన్న ఫ్లాట్ లో జీవిస్తున్నాడు. ఎవరూ ఊహించని రీతిలో కోలుకోలేని షాక్ ఇచ్చాడు మస్క్. ఏకంగా రూ. 4,400 కోట్ల డాలర్లకు మైక్రో బ్లాగింగ్ ను కొనుగోలు చేశాడు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు.
నిన్నటి దాకా ట్విట్టర్ లో మోస్ట్ పాపులర్ గా మారిన ట్విట్టర్ బ్లూ టిక్ కు మరింత అదనపు ఆకర్షణ జోడించాడు. మైక్రో బ్లాగింగ్ సైట్ ను మరింత అర్థవంతంగా , అద్బుతంగా , అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చేలా చేస్తున్నాడు ఎలోన్ మస్క్. పని చేస్తేనే ఉంటారని లేకపోతే ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించాడు. ఇప్పటికే 9 వేల మందిని తొలగించాడు ఎలోన్ మస్క్. పలు దేశాలలో బ్లూ టిక్ కోసం ఫీజును నిర్ణయించాడు.
తాజాగా భారత్ లో కూడా ట్విట్టర్ ను వాడుతున్న కోట్లాది మంది యూజర్లకు షాక్ ఇచ్చాడు. ఇక నుంచి ఫీజు చెల్లించాలని స్పష్టం చేశాడు. ఇక నుంచి ఏదీ ఉచితం కాదని పేర్కొన్నాడు. తనలోని వ్యాపారవేత్తను వెలికి తీశాడు ఎలోన్ మస్క్.
ఇందు కోసం నెల వారీ చందాను అందుబాటులోకి తీసుకు వచ్చాడు మస్క్. బ్లూ టిక్(Twitter Blue Tick) కావాలంటే నెలకు రూ. 900 చెల్లించాలి. లేదంటే ఏడాదికి రూ. 7,800 కట్టాలి.
ఒకవేళ పూర్తిగా కడతామంటే ఇందులో కొంచెం వెసులుబాటు కూడా ఇస్తున్నట్లు తెలిపాడు. ఒకేసారి చెల్లిస్తే రూ. 6,800 కే వస్తుందని పేర్కొన్నాడు మస్క్.
Also Read : జుకర్ బర్గ్ స్ట్రాంగ్ వార్నింగ్