Elon Musk : పని చేయక పోతే ట్విట్టర్ పతనమే – మస్క్
సీనియర్..ఇతరులు వైదొలగడం కారణం
Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మన్ ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ లో రోజు రోజుకు కీలక మార్పులు చేస్తూ వస్తున్న కొత్త బాస్ ప్రస్తుతం పని చేస్తున్న వారికి గట్టి హెచ్చరిక చేశాడు. ఇప్పటికే సంస్థలో ఉన్న 7,500 మంది ఉద్యోగులలో 3,978 మందిని సాగనంపాడు. ఇక సిఇఓ, సీఎఫ్ఓ, లీగల్ హెడ్ తో పాటు కీలక ఎగ్జిక్యూటివ్ లను తొలగించాడు. ఆపై ట్విట్టర్ బోర్డులో ఉన్న డైరెక్టర్లందరినీ తీసి వేశాడు.
మొత్తంగా తాను ఒక్కడినే బాస్ నంటూ ప్రకటించాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టెస్లా సిఇఓ ఒన్ అండ్ ఓన్లీ ఏక్ నిరంజన్. ఈ తరుణంలో ఇవాళ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఉద్యోగులను ఉద్దేశించి పని చేయక పోతే ట్విట్టర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు వైదొలగడం వల్ల సంస్థ దివాలా సాధ్యమేనని పేర్కొన్నాడు ఎలాన్ మాస్క్(Elon Musk).
సోషల్ మీడియా పతనం అంచుకు వెళ్లడం తాను తోసి పుచ్చలేనంటూ స్పష్టం చేశాడు ట్విట్టర్ బాస్. తాను తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే యుఎస్ రెగ్యులేటరీ నుండి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం కూడా ప్రభావం చూపనుందని సమాచారం. ఈ కీలక నిర్ణయాల ప్రభావం స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్విట్టర్ షేర్ల విలువ పెరగడం లేదా తగ్గడం జరుగుతోంది.
$44 బిలియన్లకు కొనుగోలు చేశాక రెండు వారాల తర్వాత ట్విట్టర్ ను మరింత దిగజార్చేలా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ట్విట్టర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ కిస్నర్ తాను ట్విట్టర్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. చీఫ్ ప్రైవేసీ ఆఫీసర్ డామియన్ కీరన్ , చీఫ్ కంప్లయిన్స్ ఆఫీసర్ మరియాన్ ఫోగార్టీ కూడా వైదొలిగారు.
Also Read : ట్విట్టర్ కు షాక్ సీనియర్లు గుడ్ బై