Parag Agarwal : మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్ ను టెస్లా సిఇఓ, చైర్మన్ భారీ ధరకు కొనుగోలు చేశాడు ట్విట్టర్ ను . దీంతో ఇటీవలే భారతీయ సంతతికి చెందిన ముంబై ఐఐటీ స్టూడెంట్ అయిన పరాగ్ అగర్వాల్(Parag Agarwal) సిఇఓగా నియమితులయ్యారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వ్యవస్థాపకుడు డోర్సే ప్రకటించాడు తన వారసుడు అతడేనని. పరాగ్ అగర్వాల్ తో పాటు వందలాది మంది భారతీయులు ప్రముఖ కంపెనీలను ఏలుతున్నారు.
తమ సత్తా చాటుతున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి పిడుగులాంటి వార్త ప్రపంచాన్ని కుదిపేసింది. గతంలో ఉన్నట్లు ట్విట్టర్ ఇక నుంచి ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరికొందరు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.
ఇక ప్రతిక్షణం ఇతరులపై కామెంట్స్ చేస్తూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్న ఎలోన్ మస్క్ పై విరుచుకు పడుతున్నారు కొందరు. ఈ తరుణంలో ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక చోటు చేసుకున్న పరిణామాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
అన్నీ తానై నడిపిస్తున్న పరాగ్ అగర్వాల్(Parag Agarwal) పరిస్థితి ఏంటి. ఆయన సిఇఓగా ఉంటారా లేక తప్పుకుంటారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిపై ఆసక్తికర సమాధానం ఇచ్చారు పరాగ్ అగర్వాల్ .
ప్రస్తుతం మస్క్ తీసుకున్నా ఆ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఇంకా ఆరు నెలల సమయం పడుతుంది. తన స్థానానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటూ స్పష్టం చేశారు పరాగ్ అగర్వాల్.