Twitter Employees : ఎలోన్ మస్క్ పై ట్విట్టర్ ఉద్యోగుల కన్నెర్ర
అక్టోబర్ 28 లోపు ఒప్పందం ముగింపు
Twitter Employees : టెస్లా సిఇఓ , చైర్మన్ ఎలోన్ మస్క్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానంటూ ప్రకటించి సంచలనం రేపిన మస్క్ ఆ తర్వాత దానిని కొనుగోలు చేయడం లేదంటూ బాంబు పేల్చాడు. ట్విట్టర్ యాజమాన్యం ఏకంగా కోర్టుకు ఎక్కింది. కొంటే కొను లేదంటే పరిహారం చెల్లించాల్సిందేనంటూ కోర్టు తీర్పు చెప్పింది.
అంతే కాదు ఎలోన్ మస్క్ కు అక్టోబర్ 28 లోపు డెడ్ లైన్ విధించింది. దీంతో కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో భారీగా కోత పెట్టేందుకు రెడీ అవుతారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ మస్క్ గనుక ట్విట్టర్ ను చేజిక్కించుకుంటే తమ జాబ్స్ కు భరోసా ఉండదని అర్థమై పోయింది ఉద్యోగులకు(Twitter Employees).
దీంతో ఇప్పటి నుంచే వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. తాము ఇంటి నుంచి పని చేస్తామని, తమకు వెసులుబాటు ఇవ్వాలని, ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు ఉండ కూడదని పేర్కొన్నారు. ఇప్పటికే యాజమాన్యానికి లేఖలు కూడా రాశారు. దీంతో ఎలోన్ మస్క్ కు తీవ్ర ఇబ్బందిగా మారింది ఈ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం.
ఇదిలా ఉండగా ముందస్తుగా స్టాక్ మార్కెట్ లో షేర్స్ దక్కించుకున్న ఎలోన్ మస్క్ ఆ తర్వాత తెలివిగా కొనుగోలుకు ఆఫర్ ప్రకటించాడు. కాగా మస్క్ ప్రధాన టార్గెట్ ట్విట్టర్ సిఇఓగా ఉన్న మనీష్ అగర్వాల్ ను బయటకు పంపాలని. కానీ అత్యధిక శాతం ఉద్యోగులంతా ఆయన వెంట ఉన్నారు. మరి మస్క్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
Also Read : వాట్సాప్ సర్వీసులకు అంతరాయం