Twitter Employees : మస్క్ నిర్ణయం ట్విట్టర్ ఉద్యోగులు ఆగ్రహం
ట్విట్టర్ కు 1$ బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే
Twitter Employees : టెస్లా సిఇఓ , చైర్మన్ ఎలోన్ మస్క్ (Elon Musk)ట్విట్టర్ డీల్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. దీంతో గత కొంత కాలంగా జోరుగా కొనసాగుతూ వస్తున్న చర్చలకు పుల్ స్టాప్ పడింది. దీనిపై ట్విట్టర్ చైర్మన్ తీవ్రంగా స్పందించాడు.
ట్విట్టర్ బోర్డు చట్ట పరమైన చర్యలకు దిగుతుందని స్పష్టం చేశాడు. మొదటగా గత ఏడాది ఏప్రిల్ లో ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఎలోన్ మస్క్ $44 బిలియన్ డాలర్లకు ఒప్పందం చేసుకున్నాడు.
ఒక వేళ ఆ డీల్ క్యాన్సిల్ అయినా లేదా తాను తప్పుకున్నా $1 బిలియన్ డాలర్లు ట్విట్టర్ కు పెనాల్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఎలోన్ మస్క్ తాను విరమించు కుంటున్నట్లు ప్రకటించడంతో ట్విట్టర్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు నిప్పులు చెరిగారు.
మాట మీద నిలబడలేని తత్వం మస్క్ ది అంటూ మండి పడుతున్నారు. ఆయన తప్పుకోవడమే మేలైందంటూ మరికొందరు పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలోన్ మస్క్ పై ట్రోల్ స్టార్ట్ అయ్యింది.
ఇదే హాట్ టాపిక్ గా మారింది. భారీ డీల్ కు ఓకే చెప్పి, ఆపై సంస్థ పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ , ట్విట్టర్ షేర్ల పతనానికి ఒక రకంగా కారణమయ్యాడు ఎలోన్ మస్క్.
ఈ సందర్భంగా 44 బిలియన్ డాలర్ల ఒప్పందం లోని పలు నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించందంటూ ఎలోన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశాడు.
స్పామ్ ఖాతాలపై తగినంత డేటాను మార్చడం, కొంత మంది ఎగ్జిక్యూటివ్ లు, రిక్రూట్ లను విడిచి పెట్టడం చేసిందంటూ మండిపడ్డాడు.
మస్క్ వ్యవహారం మొదటి నుంచీ సరిగా లేదంటూ ఉద్యోగులు(Twitter Employees) నిప్పులు చెరిగారు. ఒకందుకు తమకు మంచిదే అయ్యిందంటూ పేర్కొన్నారు.
Also Read : ట్విట్టర్ డీల్ కు ఎలోన్ మస్క్ గుడ్ బై