Jack Dorsey : చైనాపై ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సే ఫైర్
కోవిడ్ పరిణామాలపై కామెంట్స్
Jack Dorsey : ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్స్ (Jack Dorsey) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన డ్రాగన్ చైనా తీరుపై విరుచుకు పడ్డారు. జీరో కోవిడ్ చర్యలపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై వ్యాఖ్యానించారు.
బీజింగ్ లో చైనా జీరో కోవిడ్ వ్యూహం గురించి సీఎన్ఎన్ కు చెందిన సెలీనా వాంగ్ అందించిన నివేదిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు జాక్ డోర్స్.
ఇదిలా ఉండగా గత నవంబర్ లో ఆయన ట్విట్టర్ సిఇఓ పదవి నుంచి వైదొలిగారు. ఆయన చైనా అనుసరిస్తున్న తీరుపై ఒకరకంగా మండిపడ్డారు.
నిర్బంధం లేదా ఐసోలేషన్ ప్రయోజనాల కోసం కఠినమైన పరీక్షలు, యాప్ ఆధారిత కాంటాక్ట్ ట్రేసింగ్ ఉన్నాయని మండిపడ్డారు.
చైనా అధికారులు ఈ అప్లికేషన్ల ద్వారా ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, ట్రాక్ చేస్తుండడంపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా న్యూయార్క్ పోస్ట్ ప్రకారం సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రధానంగా చైనీస్ భాషలో, సీసీపికి అనుకూలమైన భౌగోళిక రాజకీయ కథనాలను వ్యాప్తి చేస్తున్న ఖాతాలపై విరుచుకు పడింది.
ఇక ఇచ్చిన నివేదికలో కోవిడ్ పరీక్షను క్లియర్ చేసి గ్రీన్ కోడ్ పొందిన నివాసితులు మాత్రమే బహిరంగ ప్రదేశాలను యాక్సెస్ చేసేందుకు ఉచితం అని పేర్కొన్నారు.
రెండేళ్లకు పైగా ఆంక్షలు విధించడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారని తెలిపారు. కోవిడ్ పోయినా కూడా నిఘా అలాగే ఉందని ఈ నివేదికలో స్పష్టం చేసింది.
జాక్ డోర్సే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : తక్కువ మొత్తం ఎక్కువ ఆదాయం