Damien Viel Quit : ట్విట్టర్ ఫ్రెంచ్ ఆపరేషన్స్ హెడ్ గుడ్ బై
బాస్ ఎలాన్ మస్క్ కు కోలుకోలేని షాక్
Damien Viel Quit : మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు టాప్ లో కొనసాగుతూ వస్తోంది. టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ రూ. 4,400 కోట్లకు ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ వచ్చింది.
ఇప్పటి వరకు తాను ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే సిఇఓ, సీఎఫ్ఓ, లీగల్ హెడ్ పరాగ్ అగర్వాల్ , సెగెల్, విజయా గద్దెలను తొలగించాడు. మిగతా టాప్ పొజిషన్ లో ఉన్న వారికి చెక్ పెట్టాడు. ఇదే సమయంలో చాలా మంది తాము పని చేయలేమంటూ వెళ్లి పోయారు.
మరో వైపు 4 వేల మంది పర్మినెంట్ ఎంప్లాయిస్ కు చెక్ పెట్టాడు ఎలాన్ మస్క్. ఆపై కాంట్రాక్టు కింద పని చేస్తున్న 5 వేల ఉద్యోగులను తొలగించాడు. ఆపై ఇక నుంచి రిమోట్ నుంచి పని చేస్తే రావాల్సిన అవసరం లేదని హెచ్చరించాడు. ఎవరైనా ఆఫీసులకు రావాల్సిందేనంటూ ప్రకటించాడు.
మరో వైపు కష్టపడి పని చేయాలని లేక పోతే మూడు నెలల లోపు వెళ్లి పోవాలని ఆదేశించాడు ఎలాన్ మస్క్. ఇదిలా ఉండగా ట్విట్టర్ లో పని చేసే పరిస్థితులు లేవంటూ ఏకంగా 1,200 మంది గుడ్ బై చెప్పారు.
తామే ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చారు. తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది ట్బిట్టర్ బాస్ కు . సామూహిక ఉద్యోగుల తొలగింపుల మధ్య ట్విట్టర్ ఫ్రాన్స్ చీఫ్ తాను తప్పుకుంటున్నట్లు(Damien Viel Quit) సోమవారం ప్రకటించాడు.
ప్రస్తుతం ట్విట్టర్ ఫ్రెంచ్ ఆరేషన్స్ హెడ్ డామియన్ వీల్ రాజీనామా చేయడం కలకలం రేపింది.
Also Read : మస్క్ మన్నించు ట్విట్టర్ లోకి రాలేను