Murugha Mutt Seer : మురుగ మ‌ఠాధిప‌తి శివ‌మూర్తిపై మ‌రో కేసు

జువైన‌ల్ జ‌స్టిస్ యాక్ట్ కింద న‌మోదు

Murugha Mutt Seer : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన క‌ర్ణాట‌క‌లోని మురుగ మ‌ఠం మ‌ఠాధిపతి శివ‌మూర్తి శ‌ర‌ణారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై కేసులు న‌మోదు అయ్యాయి. విచార‌ణ నిమిత్తం క‌స్ట‌డీకి త‌ర‌లించారు. ఇదిలా ఉండ‌గా బాలిక‌ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

బుధ‌వారం మ‌ఠాధిపతిపై ఏళ్ల త‌ర‌బ‌డి అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా అనాథ పిల్ల‌ల‌ను త‌న మ‌ఠంలో ఉంచార‌నే ఆరోప‌ణ‌ల‌పై క‌ర్ణాట‌క పోలీసులు క‌కేసు న‌మోదు చేశారు. శ్రీ జ‌గ‌ద్గురు మురుగ రాజేంద్ర మ‌ఠం పూర్వ మ‌ఠాధిప‌తి శివ మూర్తి ప్ర‌స్తుతం త‌న మ‌ఠంలోని హాస్ట‌ల్ లో మైన‌ర్ బాలిక‌ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన కేసులో జైలులో ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా క‌ర్ణాట‌క లోని చిత్ర‌దుర్గ రూర‌ల్ పోలీసులు శివ మూర్తి శ‌ర‌ణారావుతో(Murugha Mutt Seer) పాటు మ‌రో న‌లుగురిపై జువైన‌ల్ జ‌స్టిస్ చ‌ట్టం కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ (సీడబ్ల్యూసీ) ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం జిల్లా బాల‌ల సంర‌క్ష‌ణ విభాగం అధికారి పి. లోకేశ్వ‌ర‌ప్ప మ‌ఠాధిప‌తిపై తాజాగా ఫిర్యాదు దాఖ‌లు చేశారు.

మ‌ఠం న‌డుపుతున్న అనాథాశ్ర‌మం ఇద్ద‌రు బాలిక‌ల విష‌యంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించింద‌ని లోకేశ్వ‌ర‌ప్ప అన్నారు.

బాల‌ల సంర‌క్ష‌ణ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు జువైన‌ల్ జ‌స్టిస్ యాక్ట్ కింద పాంటీఫ్ శివ‌ముత్తి శ‌ర‌ణు, మేనేజ‌ర్ ప‌ర‌మ శివ‌య్య‌, హాస్ట‌ల్ వార్డెన్ ర‌ష్మీ, వీణ స‌హా న‌లుగురిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ బాల‌చంద్ర నాయక్ తెలిపారు.

Also Read : రేప్ లు చేసేందుకు విడుద‌ల చేశారా – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!