IPL Auction 2022 : రూ. 50 ల‌క్ష‌లు ప‌లికిన య‌శ్ ధుల్

అత్య‌ధిక ఆట‌గాళ్ల‌ను తీసుకున్న డీసీ

IPL Auction 2022 : వెస్టిండీస్ వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఇంగ్లంపై విజ‌యం సాధించి విశ్వ విజేత‌గా నిలిచిన యువ భార‌త్ జ‌ట్టు కెప్టెన్ య‌శ్ ధుల్ ను ఢిల్లీ కేపిట‌ల్స్ ద‌క్కించుకుంది.

అటు బ్యాటింగ్ లోనే కాదు కెప్టెన్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ త‌రుణంలో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ వేలంలో(IPL Auction 2022) ఊహించ‌ని ధ‌ర‌కు అమ్ముడు పోయాడు.

ఏకంగా డీసీ య‌శ్ ధుల్ ను రూ. 50 ల‌క్ష‌ల‌కు తీసుకుంది. మిగ‌తా ఫ్రాంచైజీలు పోటీ ప‌డిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్వంతం చేసుకుంది. దీంతో మ‌నోడి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది.

గ‌తంలో అండ‌ర్ -19 విజ‌యం సాధించిన టీంలో లోంచి పృథ్వీ షా ను కూడా తీసుకుంది ఆ జ‌ట్టు. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ వేలంలో (IPL Auction 2022)మొద‌టి రోజు 97 మంది ఆట‌గాళ్లు వేలం పాట‌లోకి వ‌చ్చారు.

ఎక్కువ‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కొనుగోలు చేసింది. రెండో రోజు అత్య‌ధిక ప్లేయ‌ర్ల‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్వంతం చేసుకుంది.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ కొనుగోలు చేసిన ఆట‌గాళ్ల ప‌రంగా చూస్తే అశ్విన్ హిబ్బ‌ర్ ను రూ. 20 ల‌క్ష‌లు, డేవిడ్ వార్న‌ర్ ను రూ. 6. 25 కోట్ల‌కు , క‌మ‌లేష్ నాగ‌ర్ కోటి ని రూ. 1.10 కోట్లు, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను రూ. 20 ల‌క్ష‌ల‌కు తీసుకుంది.

వీరితో పాటు మిచెల్ మార్ష్ రూ. 6.50 కోట్లు, కుల్దీప్ యాద‌వ్ ను రూ. 2 కోట్లు, శార్దూల్ ఠాకూర్ ను రూ. 10. 75 కోట్లు, ముస్తాఫిజుర్ రెహ‌మాన్ ను రూ. 2 కోట్లు, కేఎస్ భ‌ర‌త్ ను రూ. 2 కోట్లకు ద‌క్కించుకుంది.

వీరితో పాటు నార్జ్ ఆరున్న‌ర కోట్లు, అక్ష‌ర్ ప‌టేల్ ను రూ. 9 కోట్లు, పంత్ రూ. 16 కోట్లు, షాను రూ. 7.50 కోట్ల‌కు తీసేసుకుంది.

Also Read : ర‌హానేకు ఛాన్స్ పుజారాకు షాక్

Leave A Reply

Your Email Id will not be published!