UAE President : యూఏఇ అధ్యక్షుడు షేక్ ఖలీఫా కన్నుమూత
2004 నుంచి యూఏఈ, అబుదాబి పాలకుడు
UAE President : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స (యూఏఇ) అధ్యక్షుడిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ జాయెద్(UAE President) కన్నుమూశారు. ఆయన 2004 సంవత్సరం నుంచి పాలకుడిగా ఉన్నారు.
ఆయన అబుదాబి పాలకుడిగా కూడా పని చేశారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం మరణించినట్లు యూఏఈ దేశ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది.
షేక ఖలీఫా బిన్ జాయెద్ వయసు 73 ఏళ్లు. యూఏఇ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణం పట్ల యుఏఇ ,
అరబ్ , ఇస్లామిక్ దేశం ,ప్రపంచ ప్రజలకు అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది.
షేక్ ఖలీఫా యుఏఇ(UAE President), అబుదాబికి 18 ఏళ్ల పాటు పాలకుడిగా పని చేశారు. ఈ మేరకు ఆయన మృతికి సంతాప సూచకంగా 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఈ విషయాన్ని ఖలీజ్ టైమ్స్ స్పష్టం చేసింది.
దేశానికి సంబంధించి జాతీయ పతాకాలను సంతాప సూచకంగా సగం అవనతం చేస్తారని యుఏఇ వెల్లడించింది.
అంతే కాకుండా దేశంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సమాఖ్య, స్థానిక సంస్థలు శుక్రవారం నుండి విధులు , పనుల్ని నిలిపి వేస్తున్నట్లు తెలిపింది.
తన తండ్రి దివంగత షేక్ జావెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వారసుడిగా ఎన్నికయ్యాడు. నవంబర్ 2, 2004లో మరణించేంత దాకా 1971లో యూనియన్ నుండి యూఏఇ మొదటి అధ్యక్షుడిగా పని చేశాడు.
1948లో జన్మించిన షేక్ ఖలీఫా యూఏఇ రెండో అధ్యక్షుడు. అబుదాబి ఎమిరేట్ 16వ పాలకుడు.
Also Read : మాజీ మంత్రి కారు నీళ్లలోకి తోసివేత