Uddhav Thackeray : తిరుగుబాటు మంత్రులకు ఠాక్రే షాక్
శాఖల నుంచి తొలగించిన సీఎం
Uddhav Thackeray : మహారాష్ట్ర సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు బల నిరూపణ అయ్యేంత వరకు తాత్కాలిక సీఎంగా ఉద్దవ్ ఠాక్రే కొనసాగుతారు. కరోనా దెబ్బకు ఆస్పత్రి పాలైన గవర్నర్ కోషియార్ డిశ్చార్జ్ అయ్యారు.
రెబల్ ఎమ్మెల్యేల కుటుంబాలు, ఇళ్లు, ఆఫీసులకు రక్షణ కల్పించాలని డీజీపీని ఆదేశించారు. శివసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు.
మరో వైపు సీఎం ఉద్దవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేల భార్యల వద్దకు తానే స్వయంగా వెళ్లారు. తన భర్తకు సహకారం అందించాలని ఆమె కోరుతున్నారు.
ఈ సమయంలో శివసేన పార్టీకి ప్రధాన గొంతుకగా ఉన్న స్పోక్స్ పర్సన్ సంజయ్ రౌత్ కు సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈనెల 28న తమ ముందు హాజరు కావాలని పేర్కొంది. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు కేసు నమోదు చేసింది. దీనిని సంజయ్ రౌత్ వేధింపుల చర్యగా అభివర్ణించారు.
అయినా తాను తలొగ్గే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ అస్సాంలోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేసిన పలువురు మంత్రులకు సంబంధించిన శాఖలను తొలగించారు సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray).
9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖలను తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది సిఎంఓ కార్యాలయం. మొత్తంగా మరాఠా రాజకీయం మరింత వేడిని పుట్టిస్తోంది.
రాష్ట్రంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read : రాజ్ థాకరేకు ఏక్ నాథ్ షిండే పరామర్శ