Uddhav Thackeray : ఉద్దవ్ ఠాక్రేపై పోలీసులకు ఫిర్యాదు
కోవిడ్ రూల్స్ పాటించలేదంటూ ఆరోపణ
Uddhav Thackeray : మహారాష్ట్రలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మైనార్టీలో పడి పోయింది. శివసేన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు ప్రకటించాడు.
దీంతో తాను ఎవరితో కలిసే ప్రసక్తి లేదని , తలవంచనంటూ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. ఈ సందర్భంగా బుధవారం రాత్రి సీఎంఓ ఆఫీసు నుంచి ఖాళీ చేశారు.
దీంతో ఆయన తప్పుకోవడం ఖాయమని తేలి పోయింది. విషయం తెలుసుకున్న శివసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున ఠాక్రే వద్దకు చేరుకున్నారు.
భారీ ఎత్తున తొక్కిసలాట ఏర్పడింది. ఇదిలా ఉండగా ఉద్దవ్ ఠాక్రేకు(Uddhav Thackeray) పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా వచ్చిన సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ప్రకటించారు.
అందుకే తాను ఉద్దవ్ ఠాక్రేను కలవడం లేదని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ఉండాలి . లేదా కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తి ఎవరైనా క్వారంటైన్ లో ఉండాలి. పాజిటివ్ సోకిన ఉద్దవ్ ఠాక్రే ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించారు బీజేపీ నేతలు.
దీంతో కరోనా రూల్స్ అతిక్రమించారంటూ భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా ముంబై మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అంతే కాకుండా ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) కుటుంబంతో సహా మాతృశ్రీకి చేరుకున్నాక వందలాది మద్దతు దారులతో కూడా భేటీ అయ్యారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read : కథ ముగిసింది కల చెదిరింది