Uddhav Thackeray : బాబ్రీ మసీదును కూల్చి వేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు శివసేన పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray ). హనుమాన్ చాలీసా పఠించేందుకు మీరు నా ఇంటి వద్దకు రావాలని అనుకుంటున్నారు.
మీకు ఇందుకు సంబంధించి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. కానీ చాలీసా పేరుతో మీరు దాదాగిరి చెస్తే సహించబోమని, దానిని ఎలా విచ్ఛిన్నం చేయాలో తమకు తెలుసని అన్నారు సీఎం.
ఆజాన్ , హనుమాన్ చాలీసా , లౌడ్ స్పీకర్ల వాడకంపై వివాదం నేపథ్యంలో తమ పార్టీ హిందూత్వ ఆధారాలను పలుచన చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందంటూ ఆరోపించారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray ).
బీజేపీని ట్యాగ్ చేస్తూ హోరెత్తిస్తోంది శివసేన. హనుమాన్ చాలీసా పఠించండి. మేం కూడా హిందువులమే. కానీ దాదాగిరి చేస్తే ఎలా తుంచేయాలో తమకు తెలుసన్నారు.
శివసేనను సవాల్ చేస్తే మహా రుద్రుడు, గదాధిరి హనుమంతుడింత బలంగా ఉందన్నారు. గత కొన్ని రోజులుగా బీజేపీ దుష్ప్రచారం చేస్తూ వస్తోంది. శివసేన హిందూత్వాన్ని వదిలి వేసిందంటూ ప్రచారం చేయడం దారుణమన్నారు.
మనం ఏం వదిలేశామో బీజేపీ గుర్తుంచు కోవాలన్నారు. హిందూత్వ అంటే ధోతీ, వేసుకుని తీసేద్దామా ఒక్కటి గుర్తుంచు కోవాలి.
హిందూత్వం గురించి తమకు ఉపన్యాసాలు ఇస్తున్న వారు, బీజేపీ శ్రేణులు, సంస్థలు హిందుత్వం కోసం ఏమి చేశారో తమను తాము ప్రశ్నించు కోవాలని హితవు పలికారు.
బాబ్రీ మసీదును కూల్చి వేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మరాఠా సర్కార్ కావాలని విపక్షాలను అణగ దొక్కాలని చూస్తోందన్నారు మాజీ సీఎం ఫడ్నవిస్.
Also Read : మహారాష్ట్ర సర్కార్ పై ఫడ్నవీస్ ఫైర్