Uddhav Thackeray : మ‌రాఠాలో ప్ర‌జాస్వామ్యాన్ని చంపేశారు

సామ్నా ప‌త్రిక‌లో ఉద్ద‌వ్ ఠాక్రే ఆగ్ర‌హం

Uddhav Thackeray : మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించిన ఒక రోజు త‌ర్వాత ఏక్ నాథ్ షిండే శిబిరం, భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ మ‌ధ్య సంకీర్ణాన్ని శివ‌సేన త‌ప్పు ప‌ట్టింది.

బుధ‌వారం షాకింగ్ కామెంట్స్ చేసింది. రాష్ట్రంలో డెమోక్ర‌సీకి అర్థం లేకుండా పోయింద‌న్నారు ఉద్ద‌వ్ ఠాక్రే. ఆయ‌న ఎడిట‌ర్ గా తిరిగి బాధ్య‌తలు స్వీక‌రించారు.

పార్టీకి చెందిన సామ్నా ప‌త్రిక‌కు. ఈ సంద‌ర్భంగా తాజాగా రాసిన సంపాద‌కీయంలో నిప్పులు చెరిగారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన మ‌హా వికాస్ అఘాడీని కూల్చిన ఘ‌న‌త తిరుగుబాటుదారుల‌తో పాటు బీజేపీకి ఆ పాపంలో భాగం ఉంద‌న్నారు.

ఇక షిండే క్యాంపు లోని శాస‌న‌స‌భ్యుల‌లో కొంద‌రిపై అన‌ర్హ‌త పిటిష‌న్ లు సుప్రీంకోర్టులో ఉన్నాయ‌ని , అత్యున్న‌త న్యాయ స్థానం వారిలో కొంత మందిని గురువారం విచారించ‌నుంద‌ని సామ్నా సంపాద‌కీయం ఎత్తి చూపింది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జాస్వామ్యం, రాజ్యాంగాన్ని హ‌త్య చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.రాజ్ భ‌వ‌న్ లో మంత్రుల‌తో ప్ర‌మాణం చేయించిన గ‌వ‌ర్న‌ర్ కోశ్యారీపై కూడా మండిప‌డ్డారు.

గ‌వ‌ర్న‌ర్ 40 రోజుల కింద‌ట చ‌ట్ట విరుద్ద‌మైన ప్ర‌భుత్వంతో ప్ర‌మాణ స్వీకారం చేవారు. ఈ చ‌ట్ట విరుద్ద‌మైన ప్ర‌భుత్వం నుండి మంత్రుల‌కు ప్రమాణం చేయ‌డం ద్వారా పూర్తిగా రాజ్యాంగాన్ని అవ‌మానించారంటూ సంపాద‌కీయంలో పేర్కొన్నారు ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray).

కోర్టులో అన‌ర్హ‌త పిటిష‌న్లు విచార‌ణ‌లో ఉన్న కొంత మందితో ప్ర‌మాణం చేయించ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని హ‌త్య చేయ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. కానీ అలాంటి హంత‌కులు దేశంలో విడిచి పెట్ట‌బబ‌డ్డారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Also Read : 21న కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్నిక

Leave A Reply

Your Email Id will not be published!