Uddhav Thackeray : మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో వార్ నడుస్తోంది. ఇప్పటికే మహా వికాస్ అగాధీ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
కేసులు, అరెస్ట్ ల దాకా వ్యవహారం కొనసాగుతోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అనుచరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మనీ ల్యాండరింగ్ జరిపారంటూ మంత్రి నవాబ్ మాలిక్ ను అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా బీజేపీపై శివసేన పార్టీ చీఫ్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) సీరియస్ అయ్యారు. 25 సంవత్సరాల పాటు బీజేపీకి పాలు పోసి పెంచామని అన్నారు. కానీ అది తమనే కాటు వేయాలని బుసలు కొడుతోందన్నారు.
కానీ ఆ ఛాన్స్ ఇవ్వబోమంటూ స్పష్టం చేశారు. కాటు వేస్తామని ఆయన హెచ్చరించారు.బీజేపీ అనే పాము బసలు కొడుతోందని కానీ దానిని ఎలా చంపాలో తమకు బాగా తెలుసంటూ సంచలన కామెంట్స్ చేశారు.
మహా వికాస్ అగాఢీ చెందిన ఎమ్మెల్యేలు, నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఠాక్రే బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాల్గొనాలని సూచించారు.
మరో వైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం సీరియస్ అయ్యారు బీజేపీపై. కేంద్రంలోని సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో బీజేపీకి పుట్టగతులు ఉండవన్నారు. మాలిక్ అరెస్ట్ తర్వాత మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసింది వాకబు చేశారని చెప్పారు.
Also Read : టెక్నాలజీ రంగం దేశానికి బలం