Uddhav Thackeray : కేంద్రం నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం
పెంచేది మీరే తగ్గించేది మీరే
Uddhav Thackeray : దేశంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో మోదీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానంగా నిత్యం అవసరంగా మారిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మండి పోతున్నాయి.
దీంతో సామాన్యులు, వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పరిస్థితిని గమనించిన కేంద్రం దిగి వచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాన మంత్రి మోదీ సూచనల మేరకు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కొంత మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
దీని వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కాగా పనిలో పనిగా ఆయా రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ పై విధించే పన్ను ను తగ్గించాలని సూచించింది. మంత్రి ప్రకటనపై , కేంద్రం నిర్ణయంపై ఇప్పటికే పలు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి.
తమిళనాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి త్యాగరాజన్ అయితే అసంబద్దమైన నిర్ణయాలకు పెట్టింది పేరు నిర్మలమ్మ అంటూ మండిపడ్డారు. ఇక మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) సీరియస్ అయ్యారు.
పెట్రోల్, డీజిల్ పై కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం ఏ మాత్రం సరిపోదన్నారు. ఇంధన ధరల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఉద్దవ్ ఠాక్రే.
2014లో అధికారంలోకి మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ధరలు ఉన్నాయో వాటిని ప్రస్తుతం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత రెండు నెలల కిందట పెట్రోల్ ధరను లీటర్ కు కేంద్రం రూ. 18.42కి పెంచిందని కేవలం రూ. 8 రూపాయలు తగ్గించిందని , అదే విధంగా డీజిల్ ధర లీటర్ కు రూ. 18.24 కి పెంచిందని కానీ కేవలం రూ. 6 తగ్గిస్తే ఎలా అని ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) ప్రధాని మోదీని ప్రశ్నించారు.
Also Read : ప్రభుత్వం సహకారం పెట్టుబడులకు స్వాగతం