Rutuja Latke Lead : అంధేరిలో ఉద్దవ్ అభ్యర్థి లట్కే లీడ్
మరాఠా సీఎం షిండేకు బిగ్ షాక్
Rutuja Latke Lead : దేశంలోని ఆరు రాష్ట్రాలలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంటే మునుగోడులో హోరా హోరీగా పోటీ కొనసాగుతోంది. ఇక మరాఠాలోని అంధేరిలో సీఎం ఏక్ నాథ్ షిండే కు బిగ్ షాక్ తగిలింది. ఇక్కడ ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రుతుజా లట్కే ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇక్కడ ఆమె భర్త మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేనను చీల్చి బీజేపీతో జత కట్టి పవర్ లోకి వచ్చిన ఏక్ నాథ్ షిండేకు ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పక తప్పదు. తన ప్రభుత్వాన్ని గద్దె దింపిన షిండేకు ఉద్దవ్ ఠాక్రే తన అభ్యర్థికి మెజారిటీ సాధించడంలో సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.
ముంబైలోని అంధేరి (తూర్పు) అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప పోరులో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రుతుజా లట్కే(Rutuja Latke Lead) భారీ ఆధిక్యం సాధించారు. ఆమె ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులతో తలపడుతున్నారు. ఇక విచిత్రం ఏమిటంటే అత్యధిక ఓట్లు నోటాకు పడడం విశేషం.
అన్ని పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టలేదు. దీంతో రుతుజా లట్కే విజయం ఖాయమై పోయింది. ఆమెకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చాయి.
ఇదిలా ఉండగా రుతుజా లట్కే భర్త శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే గత మే నెలలో మరణించారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది. ఇక ముంబైలో ఈ నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : ఉప ఎన్నికల్లో బీజేపీ..ఆర్జేడీ లీడ్