Udhay Nidhi Stalin CM : ఒడిశా సీఎంతో ఉదయనిధి భేటీ
సహాయం చేస్తామన్న నవీన్ పట్నాయక్
Udhay Nidhi Stalin CM : తమ వారిని సురక్షితంగా తీసుకు వచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. ఒడిశా బాలా సోర్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే సీఎం అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వెంటనే తన తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhay Nidhi Stalin) తో పాటు మరో మంత్రిని రైలు ఘటన స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు మంత్రులు బాలా సోర్ కు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చుట్టు పక్కలే ఉన్న ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా తమను ఆదుకుంటుందని స్పష్టం చేశారు ఉదయనిధి స్టాలిన్. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు తమ ప్రభుత్వం చేసిందన్నారు. ప్రత్యేకించి రవాణా సదుపాయంతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలో మూడు ఆస్పత్రులను సిద్దం చేయడం జరిగిందని చెప్పారు.
అనంతరం ఉదయనిధి స్టాలిన్ సహచర మంత్రితో కలిసి నేరుగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ వారిని తీసుకు వెళ్లేందుకు గాను సహాయం చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు ఉదయనిధి స్టాలిన్.
Also Read : Manmohan Singh